Thursday, January 12, 2023


ఎస్ ఎస్ బి ఎన్ లో ఘనంగా నేషనల్ యూత్ డే.         
స్థానిక అనంతపురంలోని శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 12 జనవరి 2023 గురువారం రోజున ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి ప్రభాకర్ రాజు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ వక్త, ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ జి ఎల్ ఎన్. ప్రసాద్ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు  35 సంవత్సరాల జీవితంలో 35 వేల సంవత్సరాల జీవిత కాలాన్ని భావితరాలకు అందించారు అని పేర్కొన్నారు. యువత  బాధ్యతాయుతంగా  ప్రవర్తించి, భారతదేశాన్ని  ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనీ, 5జి యుగములో అంతరించిపోతున్న విలువలను  కాపాడుకోవాలనీ మానవతా సంబంధాలకు  ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. ముఖ్యంగా భారతదేశ యువత నైపుణ్యాలను సంపాదించుకొని, ఆధునిక విద్యా విధానంలో ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి  కళాశాల ఫార్మర్ ప్రిన్సిపాల్ ప్రస్తుత మెంబర్ ఎం రవీంద్ర కళాశాల సభ్యులు ఎ. ఎర్రి స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ నగరూరు రసూల్, వి రమాదేవి ,కళాశాల అధ్యాపకులు హరినాథ్ రెడ్డి, పుష్పలత ,సరిత, సుకన్య, మాధవి, విజయలక్ష్మి, జయరాం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



స్వామి వివేకానంద గారి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ / ఆన్ సెట్ వారి ఆద్వర్యంలో జాతీయ యువజన  దినోత్సవ వేడుకలను స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ ఎ.సి.ఆర్. దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జి‌.కేశవ నాయుడు, ఆన్ సెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జి.ఎల్.ఎన్ ప్రసాద్, జూవాలజి లెక్చరర్, కళ్యాణదుర్గం ప్రభుత్వ కళాశాల, తెలుగు లెక్చరర్, లక్ష్మినారాయణ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, హింది లెక్చరర్ నరసింహులు, సంస్కృత లెక్చరర్ సుధామ వంశీ, పోలిటికల్ సైన్స్ లెక్చరర్ సూ గప్ప, కామర్స్ లెక్చరర్ శ్రీరాములు నాయక్ మరియు శాస్త్రీయ నృత్య గురువు బాబు బాలాజి గారు పాల్గొన్నారు. 
       ఈ కార్యక్రమం లో భాగంగా వక్తలు స్వామి వివేకానందుని గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి అని తెలియ చేశారు. స్వామి వివేకానందుల వారు భారతీయుల్లో ఐక్యతను పెంచి  జాతీయతా భావాన్ని తట్టిలేపారని, ఆయన బోధనలు, సందేశాలూ యువతను సన్మార్గంలో నడిపించాయని మరియు అన్ని మతాల సారమూ ఒక్కటేనని తెలియ చేశారని ఆయన సందేశాలు, మాటలు, చేసిన పనులు అన్నీ యువతకి ప్రేరణ కలిగించేవని అందుకే ఆయన యువత కు  ఐకాన్ అయ్యారని తెలియ చేశారు. స్వామి వివేకానందుల వారు నిస్వార్థంగా మానవాళికి సేవ చేయడం ద్వారా మాత్రమే ఎవరైనా నిజంగా మతాన్ని, దేవుడిని కనుగొనగలరని నమ్మారు మరియు శ్రీరామకృష్ణ పరమహంస అనుచరుడిగా ఉంటూ, తన ఉపన్యాసాల ద్వారా దేశవ్యాప్తంగా యువ చైతన్యాన్ని పెంపొందించారు.యువతే నవసమాజ నిర్మాతలని దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రముఖమని దేశ భవిష్యత్ యువత ఆలోచనలు నడవడికతో ముడిపడి ఉందని  కావున దేశ యువత స్వామి వివేకానందుల వారు చూపిన సన్మార్గంలో పయనించి నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి దేశబివృద్దిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. 
కార్యక్రమంలో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది మరియు ఐదు జాతీయ బాషలలో నిర్వహించిన వక్తృత్వ మరియు సంస్కృతిక పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకి ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికలను బహూకరిచడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆన్ సెట్ , జిల్లా ప్రాధికార సంస్థ మరియు ఆర్ట్స్ కళాశాల సిబ్బంది, మరియు దాదాపు 250 కళాశాల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.  


 

1 Comments:

At January 12, 2023 at 6:01 AM , Blogger Manohar S Naik R said...

Excellent sir

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home