మానవులు అన్నగత ప్రాణులు. మెతుకుల వలన చాలా మంది బతుకులు బాగుపడతాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవారు. అన్ని దానాల లో శ్రేష్టం అన్న దానం. అన్నదానం లో తిన్న వాడికి సంతృప్తి .. వడ్డించిన వాడికి సంతృప్తి ఉంటుంది. అందుకే మా కళాశాల లో అధ్యాపకులు ప్రతి నెల 50 కేజీల బియ్యం ప్రతి నెల ఏదో ఒక అనాథ శరణాలయంలో ఇవ్వడానికి సన్నద్ధమయ్యారు. దీనిలో మొదటి విడత గా జి. ఎల్. ఎన్. ప్రసాద్, విజయ లక్ష్మీ, పి. ఎస్. లక్ష్మీ మరియు మాసినేని సుధాకర్ తమ వంతుగా ఉజ్వల అనాథ శరణాలయం లో 50 కేజీ ల బియ్యాన్ని జనవరి 2 , 2023 రోజున ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా చేయాలని అధ్యాపకులు సంకల్పించారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home