Friday, December 16, 2022












విద్య యొక్క పరమావధి నైపుణ్య సముపార్జన. నైపుణ్యం లేకుంటే జ్ఞానం బరువై పోతుంది. విద్య అనేది  డబ్బు సంపాదించడానికి ఉపయోగపడాలి. బతక నేర్చిన విద్యలు.. బతుకు నిచ్చే విద్యలు విద్యార్థి లోకానికి కావాలి. ఆ ఉద్దేశ్యం తోనే కళాశాల స్థాయి లో నైపుణ్యాభివృద్ధి కోర్సు లు, అలాగే Skill enhancement course లను  ప్రవేశపెట్టడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విన్నూతనంగా చేపడుతుంది అనే విషయం ఇప్పటికే మీకందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ఈ నైపుణ్యాభివృద్ధి లో భాగంగానే గోకులాపురం పౌల్ట్రీ ఫారం కు ఒక క్షేత్ర పర్యటన చేపట్టాము మేమంతా మా ప్రిన్సిపల్ ఆద్వర్యం లో. ఈ ఫారం పేరు SLNS పౌల్ట్రీ. దీని యజమాని శ్రీ బి. నవీన్ కుమార్. ఇది కేజ్ సిస్టమ్ లో లేయర్ల కోసం నిర్వహించబడుతున్న పౌల్ట్రీ. సుమారు లక్ష పై చిలుకు కోళ్ళు ఇక్కడ ఉన్నాయి. పౌల్ట్రీ దగ్గర పడుతుంటే నే .. ఆ కోళ్ళ అరుపులు చికెన్ ప్రియులను ఆహ్వానిస్తూ వినిపిస్తాయి. "మా జీవితం లో 'ఒక్కొ క్కొ క్కొ  రోజు తక్కువగు చున్నది' అన్నట్టు ఉంటాయి ఆ అరుపులు. ఈ పౌల్ట్రీ లో ఆదాయం అంతా గుడ్ల రూపం లో వస్తుంది. ఒక్కో కోడి గుడ్డు 7 రూపాయల వరకు పలకొచ్చు. డబ్బు గుడ్లు పెట్టకపోవచ్చు కానీ, గుడ్ల వలన మాత్రం డబ్బు వస్తుందనే విషయం మాకు ఇక్కడ  తెలిసి వచ్చింది. గుడ్డు అనేది very good అనేది కూడా ఇక్కడే మాకు అర్థం అయ్యింది. గుడ్డు పెట్టే కోళ్లను layers అంటారు. వాటిని చూస్తూ ఉంటే 'బంగారు కోడి పెట్టె వచ్చె నం డి' అనే పాటే గుర్తుకు వచ్చింది నాకైతే. ఈ కోళ్ళ ను cages లో పెట్టి పెంచుతున్నారు. అవి పాపం బయట పడే ప్రయత్నం చేస్తూ మెడలను నిక్క బొడుస్తున్నాయి. వాటి ముక్కులను డీ బీకర్ యంత్రం ద్వారా  'V' ఆకారం లో కత్తిరించారు. దీని వలన కోళ్ళు పెకింగ్ చేసుకోవు. చేసుకున్నా కూడా గాయాలు కావు. చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా టీచర్ 'నీ ముక్కు కోస్తారా అయ్యా' అని ఎందుకనేదో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ కేజ్ అడుగు భాగాన ట్రేలు అమర్చి పెట్టారు. వాటిలో గుడ్లు దొర్లుకుంటూ వచ్చి పడతాయి. ఇక్కడే వాడే uric acid తో తడిసిపోయిన లిట్టర్ ను రైతులు పంటల కు ఎరువుగా వాడతారు. ఇది కూడా ఒక ఆదాయ వనరు. Feed treys కూడా ఉన్నాయి. దీనిలో యంత్రాల ద్వారా ఫీడ్ ను చల్లుతున్నారు. వాటిని స్టిక్ తో సమానం చేస్తున్నారు.  ఈ ఫీడ్ లో సోయా, మొక్క జొన్న ఉపయోగిస్తారు. ఈ ఫీడ్ తో పాటే యాంటీబయోటిక్స్ ఇస్తారు.  గ్రోత్ ప్రోమోటర్స్ ను కూడా ఇస్తారు. కాల్షియం కూడా ఇస్తారు. కాల్షియం లేకుంటే కోళ్ళు తోలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే సామర్థ్యం పెంచడానికి హార్మోన్స్ ను వాడతారనేది శుద్ద అబద్దం.    పౌల్ట్రీ లో హార్మోన్స్ వాడుతున్నారనేది   వాట్సప్ పోరగాళ్ళు ప్రచారం చేస్తున్న అవాకులు.. చెవాకులు. కోడి గుడ్డు శాకాహారమే నట. దానిలో గర్భస్థ పిండం ఉండదు మరి. మీకు గుడ్డు గురించి ఒక good news. అదే మంటే ఈ గుడ్డు ను కల్తీ చేసే మొనగాడు ఇంకా ఈ భూ ప్రపంచం లో పుట్టలేదట. Egg is complete food. ఇవండీ మేము ఈ క్షేత్ర పర్యటన లో తెలుసుకున్న గుడ్డు సంగతులు. గుడ్డు గురించిన విషయాలు ఆలకించారుగా.. ఇక ఆరగించడం మొదలెట్టండి. 
 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home