కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి రోజూ ఒక సేవా కార్యక్రమం జరగడం ఆనవాయితీ అని మీ అందరికీ తెలుసు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదోయీ అని నమ్మిన వాళ్ళు మా విద్యార్థులు. అందునా రక్తం ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? కానీ మా కళాశాల విద్యార్థులు మాత్రం గత కొద్ది నెలలుగా RDT hospitals లో ప్రతి వారం ఒక అయిదు మంది చొప్పున రక్త దానం చేస్తున్నారు. మరి నిన్న మొన్న కళాశాల లో చేరిన వారికి వారి రక్తం గ్రూప్ ఏమిటో తెలిస్తే , అవసరమున్నప్పుడు, ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో ఈ "Blood group determination camp" ను డిసెంబర్ 13 , 2022 న కేర్ ఇండియా లిమిటెడ్ ఆద్వర్యం లో , NSS కాంతారావ్ సహాయం చే, జంతు శాస్త్ర విభాగం లో ప్రిన్సిపల్ జయరామ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సుమారు 250 మంది విద్యార్థినీ, విద్యార్థులు తమ రక్తం గ్రూప్ ను తెలుసుకుని, గుర్తింపు కార్డు ను పొందారు. ఈ సందర్భంగా, రక్తం గురించి కొన్ని శాస్త్రీయమైన విషయాలు తెలుసుకుందాము.
- ఆరోగ్యకరమైన మానవుడి లో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది
- రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు.
- కొద్ది మందికి రక్తం అంటే భయం. రక్తం చూస్తే చాలు కళ్ళు తిరుగుతాయి. దీనిని హెమెటో ఫోబియా అంటారు. మా విద్యార్థులకు ఇలాంటి భయాలు లేవనుకోండి.
- రక్తం ఒక ద్రవ రూప సంధాయక కణజాలం.
- రక్తం లో ప్లాస్మా అనే మాత్రిక మరియు రక్త కణాలు ఉంటాయి
- ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్ లెట్స్ అనే మూడు రకాల కణాలు రక్తం లో ఉంటాయి.
- ఎర్ర రక్త కణాల మీద హీమో గ్లోబిన్ అనే శ్వాస వర్ణ దం ఉంటుంది.
- కీటకాల రక్తం లో హీమో గ్లోబిన్ లేకపోవడం వలన వాటి రక్తం తెల్లగా ఉంటుంది. దోమ ను చరిచి చంపినప్పుడు ఎర్ర గా బయటకు చిమ్మిన రక్తం, అది తాగిన మీ రక్తమే నండోయ్.
రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన ప్రోటీన్లు ఫైబ్రినోజెన్ మరియు prothrombin.
రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేసే పదార్థం హెపారిన్.
అలాగే EDTA కూడా రక్త స్కందన నిరోధకంగా పనిచేస్తుంది
రక్తాన్ని నాలుగు ప్రధాన గ్రూప్ లుగా వర్గీకరించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్. ఈ పరిశోధనకై ఈయనకు నోబెల్ పురస్కారం ఇచ్చారు.
తరువాత Rh కారకాన్ని రీసస్ కోతి రక్తం లో కనిపెట్టారు. తరువాత మానవుడి లో కూడా ఈ Rh కారకాన్ని కనిపెట్టారు. ఈ Rh కారకము రక్తం లో ఉంటే దానిని Rh పాజిటివ్ అని, లోపిస్తే Rh నెగెటివ్ అని అంటారు. ఇండియా లో Rh నెగెటివ్ ఉన్న వారి శాతం కేవలం 5%.
అసలు రక్త మార్పిడి ఎప్పుడు అవసరం అవుతుందో తెలుసా!!!!!!
- శస్త్ర చికిత్స లో
- గర్భిణీ స్త్రీలకు
- అనీమియా రోగులకు
- ప్రమాదాల సమయం లో - మీకు తెలిసిందే కదా .. గమనం మీద ధ్యాస తప్ప, గమ్యం మీద ధ్యాస లేని యువత బైక్ ల మీద దూసుకెళుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. చావు బతుకుల్లో ఇలా కొట్టు మిట్టాడుతున్న వారికి రక్తం అవసరం ఎంతో ఉంది. మీరు కూడా మీ రక్తాన్ని దానం చేయండి.. కానీ రహదారుల మీద కాదు సుమా!!!!
- థాలిసీమియా వ్యాధిగ్రస్తులకు
- కాన్సర్ వ్యాధిగ్రస్తులకు
మరి మీ రక్తం గ్రూప్ లేవో తెలిసాయి కదా స్టూడెంట్స్!!!! ఇక రక్త దానం చేద్దాం. మీరు చేసే రక్త దానం ఒక కుటుంబాన్ని కాపాడుతుంది.
మీకు ఇంకో విషయం చెప్ప మన్నారు మా ప్రిన్సిపల్. అదేమంటే జీవితం లో డబ్బు, జ్ఞానం మరియు రక్తం ఎప్పుడూ ప్రవహించాలట.. అంటే ఒకరి నుంచి ఒకరికి చేరాలట.
ఇక ఇంత బృహత్తర కార్యక్రమం లో పాల్గొన్న టెక్నీషియన్స్ ఎవరో చూడండి మరి.
S.No |
Name
of the technician |
1 |
C.Radha |
2.
|
M.
Mahesh |
3 |
B.
Hari Krishna |
ఇంకేం.. తెలుసుకున్నారుగా.. ఇక రక్త దాన ఉద్యమానికి నేను సైతం అంటూ ఉద్యుక్తులు కండి.
Labels: Blood group determination
1 Comments:
రేపటి భారతదేశం తరగతి గదిలో రూపు దిద్దుకుంటూఉన్నది అన్నది కొటారి కమిషన్ ఆ మాటలు నిజం చేస్తున్నారు SVGM GDC Kalyanadurg లో....అభినందనలు మీ ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు. 🙏🙏🙏
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home