కొన్ని కార్యక్రమాలు లేట్ గా చేసినా కూడా లేటెస్ట్ గా చేయడం మా విద్యార్థులకు మాత్రమే సాధ్యం. ఈ సంవత్సరం కాలెండర్ మారే రోజు అంటే డిసెంబర్ 31, 2022 న సీనియర్ విద్యార్థులు, జూనియర్ల కు స్వాగత సన్నాహాలు చేశారు. ఇక మీకు తెలియనిది ఏముంది చెప్పండి.. మా విద్యార్థులు ఏమి చేసినా కూడా జాతరే. ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారో ఏమో మరి మేమంతా కళాశాల కు చేరుకునేటప్పటికి అక్కడ ఓ వసంతం.. ఓ ఇంద్రధనస్సు మాకు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నాయి . ఎక్కడ చూసినా రంగవల్లులు తీర్చి దిద్దబడ్డాయి. ప్రాంగణం లో ఉన్న సరస్వతి మాత తన బిడ్డల కళా నైపుణ్యం చూసి మురిసి పోతూ ఓ చిరునవ్వు విసిరింది. ఆవరణ అంతా డి. జె తిల్లు పాటలతో మారు మ్రోగుతూ ఉంది. ఆ ఎనర్జీ లెవెల్స్ అందరికీ సాధ్యం కావు సుమండీ!!!!!! ఇంత హంగామా లో కూడా మా విద్యార్థులు సంప్రదాయ ఉల్లంఘన మాత్రం చేయలేదు. ఎప్పుడు పిలిచారో ఏమో ప్రస్తుత కార్పోరేటర్ మరియు మా కళాశాల పూర్వ.. అపూర్వ విద్యార్థి అయిన సుధీర్ ని ముఖ్య అతిథి గా పిలిచారు. వేదిక మీదికి ఒక్కొక్కరినీ పిలుస్తూ ఉంటే, అభిమానం తో మా విద్యార్థులు మమ్మల్ని ఆహ్వానిస్తూ శివమెత్తి అరుస్తూ ఉంటే, సినిమా స్టార్స్ కు కూడా లేని క్రేజ్ "మాస్టార్స్ " కి ఉంది కదా అనిపించి మేమంతా పొంగిపోయాము. ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం.. అంతే. ఒక తరాన్ని (ఏ )మార్చే తరగతి లో మేముండడం.. ఒక తరానికి మంత్రసాని తనం చేయడం మాకు మాత్రమే సాధ్యం. మీరంతా నా మాటలకు 'అంతేగా.. అంతేగా..' అని తీరాల్సిందే. మనకంతా Fun....frustration ఉండి తీరాల్సిందే. ఈ రెండిటిలో ఏది ఎంచుకుంటాం అనేది మన చాయిస్ మరి.
ఇక మా విద్యార్థులను ఉద్దేశించి మా ప్రిన్సిపల్ మరియు గురువులు ఎంత బాగా ప్రసంగించారని! ఆ ప్రసంగ పాటం ఇది. " విద్యార్థులరా! నాకు ఇద్దరు గురువులు. అనుభవం.. కాలం. అనుభవం పోగేసుకొమ్మని చెపితే.. కాలం పోగొట్టుకొమ్మని చెప్పింది. ( ఇ క్కడ విద్యార్థుల చప్పట్లు.. కాదు కాదు.. గుండె చప్పుళ్ళు ). మేము గురువుల వొడి లో, బడిలో చదువులు నేర్చుకుంటే మీరంతా గూగులమ్మ బడిలో చదువుకుంటున్నారు. మావి వాన కాలం చదువులు. మీవి ఆండ్రాయిడ్ చదువులు. మీవన్నీ తెర చాటు చదువులు. గురువుకు ఫిల్టర్లు ఉంటాయి.. గూగుల్ కు ఉండవు. కాబట్టి మీరు ఇంకా బాధ్యతా యుతంగా ఉండాలి. మీరంతా 5 G తరం విద్యార్థులు. మీ తరాన్ని తీర్చి దిద్దడం మా తరం కావడం లేదు. మిమ్మల్ని మార్చడానికి మా అధ్యాపక బృందం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. blended class room పద్దతి లో చెపుతున్న సవ్య సాచులు మా గురువులు. మీరు off line లో కాలేజీ కి రాకుంటే online లో మీ నట్టింటికి మేమే వస్తాం. మా గురువులు పట్టుదల సామాన్య మైనది కాదు. మీ వెంటే మేముంటా మంటూ హచ్ సిగ్నల్ లాగా మీ వెంట పడతాము ( ఒక విద్యార్థి వెనక నుంచి 'భౌ.. భౌ.. అని అరిచి తన హాస్య స్పూర్తిని ప్రదర్శించాడు) ఇంకో విషయం చెపుతా విద్యార్థు లారా! 'నీరెళ్ళి పోయింది.. యేరుండి పోయింది.. నీటి మీద రాత రాసి నావెళ్ళి పోయింది..' అన్నట్టుగా మనమం తా కొద్ది కాలం తరువాత ఈ కళాశాల వదిలే స్తాము ( వద్ధు.. వద్ధు.. అని ఒక విద్యార్థిని ఆక్రోశం ఇక్కడ). అంతలో మీరు ఈ చదువుల తల్లి ఒడిలో మీ భవిష్యత్తు ను నిర్మించుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు మీ కోసం చేస్తున్నాము. ఈ రోజున్న ఉత్సాహం మీకు జీవితమంతా ఉండాలి. 'ఉత్సాహము న కన్న ఉర్వి బలమే లేదు' అన్నారు కదా! మీకోసం JKC...library...labs....e class rooms ఇన్ని ఏర్పాటు చేశాము. ( 'అవన్నీ సరే మరి సిలబస్ ఎప్పుడేం టి? ' అని ఒక విద్యార్థి మెల్లిగానే అరిచినా.. మాకు మాత్రం గట్టిగానే వినపడింది. మా చెవులు పాడై పోనూ .. పడకూడనివి మా చెవుల్లోనే పడతాయి. ఇక్కడ కొసమెరుపు ఏమంటే.. ఆ sattire వేసిన సదరు విద్యార్థి అసలు కాలేజీ కే రాడు. వాడిని రప్పించాలి అంటే మేము రోజూ ఫ్రెషర్స్ పార్టీ చేయాలి). internship లు మీ సీనియర్ లు చక్కగా పూర్తి చేశారు ( అవునా.. అవునా .. అవునవునవునవు నా !!!! అని మళ్ళీ ఎవరో మెల్లిగానే అరిచారు. కానీ ఈసారి విద్యార్థులు కాకుండా మా గురువు ల లోనే ఎవరో అరిచినట్టు అనిపించింది.) కమ్యూనిటి సర్విస్ ప్రొజెక్ట్స్ చేశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుని మీరు మీ బంగారు భవిష్యత్తు కు పునాదులు వేసుకుంటారని ఆశిస్తున్నాము ' అని ముగించారు మా ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు. తరువాత ఓ పది మంది విద్యార్థులు మాట్లాడారు.
మధ్యాహ్నం షడ్ర సోపేతమైన భోజనం పెట్టారు. తరువాత మొదలైంది అసలు హంగామా. డాన్స్ లే.. డాన్స్ లు. ఏ చానెల్ అయినా వీటిని ప్రసారం చేస్తే వాటి TRP ratings ఎక్కడికి పోతాయో చెప్పలేము. డి జె లతో స్టేజ్ దద్దరిల్లింది. స్టేజ్ క్రింద కొచ్చి కూడా ఎగిరారు మా విద్యార్థులు. వాళ్ళు ఎగురుతుంటే, దుమ్ము ఆకాశానికి అంటింది. కొద్దిగా మా కళ్ళల్లో కూడా పడింది.. అది వేరే విషయం. దమ్ము న్న విద్యార్థులు ఆ మాత్రం దుమ్ము రేపడం లో ఆశ్చర్యం ఏముంది చెప్పండి!!!!!!!. ఎగిరి.. ఎగిరి.. అలిసి పోయి చివరకు ఇంటి దావ పట్టారు మా విద్యార్థులు. నేను కూడా ఇంటికి వెళుతూ FRS లో నా హాజరు నమోదు చేస్తూ ఉంటే 'ఏమి ఉద్ధరించావు ఈ రోజు నీవు ?" అంటూ దానిలో నా ముఖం నన్నే వెక్కిరించింది. ఆ ఆప్ లో నా అంతరాత్మ నన్ను నిలదీసింది. ఈ 'ఆప్ సోపాలు' వద్దురా బాబు అంటూ కారెక్కి కూచుని అందరం బయలుదేరాం.
( అందరికీ శుభమగుగాక !!!!)
Labels: Freshers party
3 Comments:
Excellent sir 👌🙏
చాలా బాగుంది సర్ , నే రు గా పాల్కగొన లేక పోయినా కళ్ళకు కట్టి నట్టు వివరించారు, ముఖ్యంగా మంత్ర సాని అనే పద ప్రయోగం మాత్రం అద్భుతం సర్ ఒక తరానికి మార్గనిర్దేశం చేసే మీరు జ్ఞానానికి జనింపచేసే కార్యానికి మంత్ర సాని వర్క్ చేస్తున్నారు
హై స్కూల్ లో నే నాకు క్లాస్ కి వెళ్ళిన ప్రతి సారి పిల్లలు అల్లరి చేయటం మాట వినక పోవటం వారి మీద కోపం రావడం జరిగేది సర్ , అలాంటి ది కాలేజిలో పిల్లలు ఎలా ఇంత క్రమ శిక్షణ తో ఇన్ని కార్య క్రమాలు , చేస్తున్నారో ఆశ్చర్య మేసేది, ఒక నిజమైన గురువు నిర్దేశనం ఉంటే వేరే ఆ మూస లో ఒదిగి పోతారు అని మీ పరిచయం తరవాత తెలిసింది సర్, ఇపుడు అదేదో తెలియదు వాళ్ళు మాట వినక పోయినా కోపం రావట్లేదు ముందు కంటే పిల్లలు చెప్పిన మాట వినటం చేస్తున్నారు ,క్రమంగా మారుతున్నారు 🙏🙏🙏
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home