అనంతపురము : 20-12-2022.
గౌరవ కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, APSTEP., విజయవాడ వారి ఆదేశానుసారం, వ్యక్తిత్వ వికాసం మరియు కేరీర్ గైడెన్స్ (Personality Development & Career Counseling Programme) కార్యక్రమంను తేది: 20.12.2022 న స్థానిక రాజేంద్ర మునిషిపల్ హై స్కూల్, అనంతపురము నందు నిర్వహించడం జరిగినది.
కార్యక్రమంలో భాగంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో మార్పు పాఠశాల నుండి మొదలవుతుందని కావున విద్యార్థినీ విధ్యార్థులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని మరియు కేవలం మార్కులు ర్యాంకుల కోసం కాకుండా విలువలతో కూడిన విధ్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా మారాలని సూచించారు. శారీరక వ్యాయామం, యోగా లను దైనందిక జీవితంలో భాగం చేసుకొని క్రమశిక్షణతో మెలగాలని కోరారు.
వ్యక్తిత్వ వికాస నిపుణులు విద్యార్థులు జ్ణాపకశక్తి మెరుగుపరచు కోవడానికి విలువైన సూచనలు అంధించారు మరియు విధ్యార్థులు పాఠ్యాంశాలను అర్థంచేసుకొని చదవాలని అందుకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్తికి తగిన సహాయ సహకారాలు అంధించాలని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ/ANSET, అనంతపురము వారు పదవ తరగతి తరువాత విద్యార్థినీ విద్యార్థుల కు గల ఉన్నత విద్యా-ఉధ్యోగ అవకాశాలు మరియు పోటీ పరీక్షల యొక్క సవివరములతో ముద్రించినటువంటి పుస్తకములను విద్యార్థుల ప్రయోజనార్థం పాఠశాల అధ్యాపకులకు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆన్ సెట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శ్రీ జి.కేశవనాయుడు గారు, రాజేంద్ర మునిషిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి బి.పద్మావతి గారు, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ లెక్చరర్ మరియు వ్యక్తిత్వ వికాసం నిపుణుడు GLN ప్రసాద్ గారు, యూత్ వెల్ఫేర్ సూపరెంటెండెంట్ శ్రీ కె.మూర్తి గారు, ఆన్ సెట్ కార్యాలయ సిబ్బంధి, పాఠశాల అధ్యాపక సిబ్బంది శ్రీ రామాంజినేయులు,శ్రీ.పి.శ్రీనివాసులు, శ్రీ యుగంధర్, శ్రీ దివాకర్ నాయుడు, శ్రీ రవీంద్ర, శ్రీ భాస్కర్ రెడ్డి ఇతర సిబ్బంది మరియు 220 మంది విద్యార్థినీ విధ్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.
ముఖ్య కార్యనిర్వాహణాధికారి,
ఆన్ సెట్., అనంతపురము
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home