"మనిషన్న తరువాత .. కాస్తంత కళా పోషణ ఉండాలి" అని ముత్యాల ముగ్గు సినిమా లో డైలాగు మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. మేము ముత్యాల ముగ్గుల పోటీ ఒకటి మా కళాశాల లో 7 జనవరి 2023 న నిర్వహించాము. అమ్మాయిలతో పాటుగా, కొంత మంది అబ్బాయిలు కూడా దీనిలో పాల్గొనడం ఒక విశేషం. సంక్రాంతి సందర్భంగా దీనిని మా ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి నిర్వహించమని చెప్పడం తో, మహిళా అధ్యాపకులు కృష్ణ వేణి, రుక్మిణీ భాయి, అఖిలా బేగం మరియు డాక్టర్ P.S. లక్ష్మీ ఆధ్వర్యం లో నిర్వహించారు. సుమారు 30 మంది విద్యార్థినులు దీనిలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీ వలన విద్యార్థినులకు ఏమి ఉపయోగం అని అజ్ఞానం తో అడిగితే మా ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి ఎంత చక్కటి సమాధానం ఇచ్చారో చూడండి.
- ముగ్గు ఎప్పుడూ కూడా బియ్యం పిండి తో వేయాలి. దీని వలన చీమల లాంటి చిన్న, చిన్న జీవాలకు ఆహారం లభిస్తుంది.
- ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎంతో కళ గా ఉంటుంది.
- ముగ్గు వేయడానికి అనేక సార్లు లేచి కూచోవడం వలన కాలి మరియు పాదాల కండరాలకు ఫిజీయో థెరపీ లభిస్తుంది. కూచుని లేచినప్పుడు కలిగే ఒత్తిడి వలన నాడీ సంబంధ రుగ్మతలు రావు.
- చుక్కలు కలపడం వలన .. జీవితం లో కూడా వివిధ సంఘటనలను ఎలా సమన్వయం చేసుకుని పోవాలో తెలుస్తుంది. నలుగురిని కలుపుకుని ఎలా పోవాలో తెలుస్తుంది. విజయాల చుక్కలను కలపడం అలవాటవుతుంది.
- రంగులు నింపడం వలన మానసిక సమతుల్యత కలిగి .. జీవితం లో ఏ ఎమోషన్ ను ఎంత మోతాదు లో వాడాలో తెలుస్తుంది. రంగులన్నీ వివిధ ఎమోషన్ల కు ప్రతీకలు కదా!!!!!
ముగ్గు వేయడం వెనుక ఇంత శాస్త్రీయత ఉందా అనిపించింది. అందుకే మరి ప్రతి శుభ కార్యానికి ముగ్గులేసేది. సరి .. సరి.. నేను కూడా ఓ ముగ్గే స్తే పోలేదా అనిపించింది.
ముగ్గు లోని చుక్కలు, గీతల లో ఉన్న ఇంత స్వారస్యాన్ని వివరించిన మా ప్రిన్సిపల్ కు మా నమోవాకాలు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home