మనసు ఇంద్రియాలకు అధిపతి. మానసిక రోగాలకు మాటే మంత్రం, మాటే పరమౌషధం. నేనున్నానే ఆసరా చాలు ఎంతటి ఉగ్ర మానసిక రోగమైనా నయం కావడానికి. అదేదో సినిమాలో మనసును వర్ణిస్తూ, 'చింతల చెలి నీవు, కోర్కెల వల నీవు, ఆశల దెయ్యానివే లే.. మనసా, తెగిన పతంగానివే లే, ఎందుకు వలచేవో , ఎందుకు పొగిలేవో, ఏమై మిగిలేవో' అని అంటాడు ఆ సినీ కవి. అలాంటి కోతి లాంటి మనసును మచ్చిక చేసుకోవడం ఎలా? ఇది మానసిక శిక్షణ ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఆధునిక కాలం లో కుంగుబాటు సర్వసాధారణం అయిపోయింది. అన్ని వయసుల వారిలోనూ ఇది కనపడుతోంది. అనవసర ఆందోళనా, భయం కూడా చాలా మందిలో ఉంటోంది. మరి ఇటువంటి మానసిక రుగ్మతలకు క్రింద పేర్కొన్న సూత్రాలే మందులు.
- లేనిది కావాలన్న ఆరాటం వద్ధు
- ఉన్నది పోతుందన్న భయం వద్ధు
- వర్తమానం లో జీవించడం మంచిది.
- ఆస్తులు కూడబెట్టడం కాకుండా, అనుబంధాలు బలపడేలా జీవించాలి.
- ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించండి.
- హింసాత్మక దృశ్యాలను, చిత్రాలను చూడకండి.
- సంతోషాన్ని సృష్టించండి.
- కామెడీ సినిమాలు చూడండి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
- విహార యాత్రలకు వెళ్ళండి
- దైవ భక్తి మంచిదే గానీ, అది మూఢ నమ్మకం స్థాయికి చేరకుండా జాగ్రత్త పడండి
- నలుగురితో కలివిడిగా ఉండండి.
- మొబైలు ను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించండి
- మంచి చేయడం లో ఉన్న థ్రిల్ ను అనుభవించండి
- స్త్రీలలో ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యత వలన మానసిక క్రుంగుబాటు కలుగవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి
- తోటివారు, కుటుంబ సభ్యులు చేసే చిన్న తప్పులను పెద్ధ మనసు తో క్షమించడం నేర్చుకోండి.
- విభేదాలు, విద్వేషాలు వద్ధు.
- అనారోగ్యకరమైన పోటీ వద్ధు.
- మంచి అలవాట్లు మనసును ఉత్తేజపరుస్తాయి.
- మంచి నిద్ర, కొద్దిపాటి ధ్యానం చాలు అన్నీ సర్దుకోవడానికి.
- సమస్య ను అవకాశంగా తీసుకోండి
- విద్యార్థులు కేవలం చదువే జీవితం అనుకోకుండా, మీకు ఇష్టమైన రంగం లో రాణించే ప్రయత్నం చేయండి.
ఈ సదస్సులో ప్రభత్వ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర విభాగాధిపతి జి. ఎల్. ఎన్. ప్రసాద్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హేమలత, గైనకాలజిస్ట్ సత్య ప్రియ, డాక్టర్ సుస్మితా, డాక్టర్ సుప్రియా మరియు నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
2 Comments:
Nice pieces of advice. Very relevant to the gullible youth.
Very needy to everyone.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home