Saturday, October 8, 2022

             Space and Sustainability theme on 8th October 2022 at District Science Center Anantapur 









 పుట్టపర్తి లో జరిగిన అంతర్జాతీయ వారోత్సవాల సందర్భంగా 'అంతరిక్షం మరియు సుస్థిర అభివృద్ది' అనే అంశం మీద జరిగిన వ్యాస రచన, వక్తృత్వం లాంటి వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమాన్నిఅనంతపురం జిల్లా కేంద్రం లోని డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ లో  జిల్లా విద్యాశాకాధికారి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, డిస్కవర్ అనంతపూర్ అధినేత, పక్షి ప్రేమికుడు అనిల్ కుమార్, జంతు శాస్త్ర అధ్యాపకులు జి. ఎల్. ఎన్. ప్రసాద్ హాజరయ్యి సందేశాలు ఇచ్చారు. వీరితో పాటుగాఈ కార్యక్రమ సూత్రధారులైన, ఇస్రో శాస్త్రవేత్తలైన మురళి, రంజిత్ కుమార్ మరియు మనోహర్ లో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ "భారత దేశం ఎన్నో విలువైన అంతరిక్ష పరిశోధనలను చేపట్టి, ప్రపంచానికే తలమానికంగా ఉందని, ముఖ్యంగా విద్యార్థినులు కల్పన చావ్లా మరియు సునీత విలియమ్స్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని అంతరిక్ష శాస్త్రం లో సైంటిస్ట్స్ గా ఎదగాలని" తెలిపారు. పక్షి ప్రేమికుడు మరియు డిస్కవర్ అనంతపూర్ అధిపతి అయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ "అంతరిక్షం లో ఎన్ని పరిశోధనలను చేసినా, నివసిస్తున్న నేలను మారువ రాదు, మొక్కలను నాటడం ద్వారా నేలను రక్షించుకుందాం" అని పిలుపునిచ్చారు. జంతు శాస్త్ర అధ్యాపకులు జి. ఎల్. ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ ' ఎలాన్ మస్క్ ప్రారంభించిన స్పేస్ టూరిజం లో అనంత విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, రాత్రి పూట ఆకాశం లోని నక్షత్రాలను చూస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని" అన్నారు. ఇస్రో ప్రతినిధి మురళి, రంజిత్ కుమార్ మరియు మనోహర్ ఇస్రో మరియు ఇస్రో సంబంధిత సంస్థలు భవిష్యత్ లో చేపట్టే బోయే వివిధ అంతరిక్ష కార్యక్రమాల గురించి విద్యార్థులకు తెలియజేశారు.  ప్రతి పాఠశాల లో భౌతిక శాస్త్ర విభాగ ప్రాముఖ్యత గురించి జిల్లా విద్యా శాఖాధికారి తెలియజేశారు.  కార్యక్రమానికి అనుబంధంగా చెత్త నుంచి గృహం లో వాడుకునే వివిధ వస్తువులను ఎలా తయారు చేయవచ్చు అనే అంశం గురించి విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి లక్ష్మీ నారాయణ మాట్లాడారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు గాను, ఆనంద భాస్కర్ రెడ్డి మరియు రంగయ్య లను విద్యా శాఖాధికారి అభినందించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home