Friday, September 16, 2022












 మనం నైపుణ్య భారత్ వైపు అడుగులు వేస్తున్నాము. నూతన విద్యా విధానం ప్రకారం డిగ్రీ విద్యార్థులందరు కోర్సు పూర్తీ అయ్యేంతలో పది నెలల ఇంటర్న్షిప్ పూర్తీ చేయాల్సి ఉంటుంది. మొదటి  ఇంటర్న్షిప్  సామాజిక సర్వే రూపంలో ఇప్పటికే పూర్తీ అయ్యింది. దానిలో విద్యార్థులు మమేకమైన తీరు చూసి విద్యావేత్తలు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రెండో ఇంటర్న్షిప్  మొదలయ్యింది. అన్ని  కళాశాలలు యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులను ఇంటర్న్షిప్  కోసమై వివిధ పరిశ్రమలకు అనుసంధానం చేశాయి. విద్యార్థులను మరియు మెంటర్ లను కూడా అనుసంధానం చేశారు. నూతన విద్యా విధానం అంతా కూడా 'యాప్.. లు.. మాప్  లు" చుట్టూ పరిభ్రమిస్తోందని కొద్దిమంది ఆడిపోసుకున్నా కూడా, ఈ ఇంటర్న్షిప్  లో అధ్యాపకులు, విద్యార్థులు అనుసంధానం అవుతున్న తీరు చూస్తుంటే, మన నైపుణ్య భారత్ కల సాకారం అయ్యే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది. ఇక కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అందరూ కూడా ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చక్కగా సఫలీకృతం చేస్తున్నారు. ఈ ఇంటర్న్షిప్ మీద వీరు చేసిన యూట్యూబ్ వీడియో ఇప్పటికే సహస్రాధికంగా వీక్షకులను ఆకర్షించింది. ప్రిన్సిపల్ జయరామ రెడ్డి విద్యార్థులకు ఇంటర్న్షిప్ లో ఏ విధంగా మెలగాలో ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం, పట్టు పరిశ్రమ, సూపర్ మార్కెట్స్, క్లినికల్ లాబ్స్, నర్సరీలు, డ్రిప్ ఇరిగేషన్ లాంటి చోట వివిధ విద్యార్థులను ఇంటర్న్షిప్  కు పంపారు. ఇంటర్న్షిప్  లో మార్కులు ఎలా సాధించుకోవాలో చక్కగా విద్యార్థులకు కల్యాణదుర్గం ప్రభత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు తెలియజేశారు. అంతే కాకుండా విద్యార్థులు ఇంటర్న్షిప్  లో ఏ విధంగా పాల్గొంటున్నారో కూడా పర్యవేక్షిస్తున్నారు. 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home