కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మొట్టమొదటి సారిగా అష్టావధానం ప్రిన్సిపల్ జయరామ రెడ్డి ఆధ్వర్యం లో జరిగింది. ఈ సెప్టెంబర్ 14 , 2022 కళాశాల చరిత్ర లోనే ఓ మధురమైన ఘట్టం. కళాశాల మొత్తం అష్టావధానం కోసం ముస్తాబయ్యింది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. కళాశాల లో ప్రతిష్టి తమైన సరస్వతి............. అవధాన సరస్వతి గా మారిపోయింది. ఎక్కడ చూసినా తెలుగుతనం వెల్లివిరిసింది. ఉప్పల ధడియం భరత్ శర్మ అవధాని గా ఎనిమిది మంది పృచ్ఛకులతో కూడుకున్న ఈ సభ మరో భువనవిజయాన్ని తలపించింది. శ్రోతలు నవ రసాల లో ఓలలాడారు. జాగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి అప్రస్తుత ప్రశంస విద్యార్థులను అలరిచింది. ఈ కాలం పిల్లలకు అష్టావధానం ఎందుకు అనేదానికి ప్రిన్సిపల్ జయరామ రెడ్డి మంచి సమాయస్పూర్తితో సమాధానం ఇచ్చారు. మనిషన్న తరువాత కాస్త కళాపోషణ ఉండాలని మా అందరి అభిప్రాయం. అవధానం లో గ్రహణ, ధారణ రెండూ ఉంటాయి. ఈ రెండూ విద్యార్థులకు కూడా అవసరమే కదా!!! అవధాని కున్న ఏకాగ్రత ను విద్యార్థులు అలవర్చుకుంటే పరీక్షలలో విజయం తథ్యం. నిషిద్ధాక్షరి చూడండి ఏమి బోధిస్తుందో!!!! జీవితం లో మధురాక్షరాలను గ్రహించి .. మధురం కాని అక్షరాలను నిషేధించాలి అని దాని అర్థం. కవిత్వం అంటేనే లయ. లయ లేకుంటే మిగిలేది లయమే. ఈ అష్టావధానం కార్యక్రమం ఇంత దిగ్విజయం గా నిర్వహించబడడానికి కారణమైన మా అధ్యాపకులు కాంతా రావ్, మాసినేని సుధాకర్, తెలుగు అధ్యాపకులు పరమేశ్, అంజిన రెడ్డి, అనిల్ , గణేష్ ,శ్రీదేవి, రుక్మిణీ భాయి, లక్ష్మీ, కృష్ణవేణి మరియు అఖిల లకు నమోవాకాలు. రసజ్ఞులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని కోరడం తో భవిష్యత్తు లో సంగీతావధానం కూడా జరపాలని మా ప్రిన్సిపల్ ఒక కృత నిశ్చయానికి వచ్చారు. అస్తు.. తథాస్తు
Labels: అవధానం
1 Comments:
Super sir
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home