నీరే ప్రాణాధారం.. అలాంటి మంచి నీటికి అనంతపురం జిల్లా లో ఎప్పుడూ కట.. కటే. చాలా మంది విద్యార్థులు కళాశాలల లో మంచి నీరు లభ్యం కాకపోవడం వలన చదువు మానేస్తున్నారు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. కల్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో కూడా నీళ్ళు లేక బీళ్లు నోళ్ళు తెరుస్తున్నాయి అంటే అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి కరువు సీమ అయిన కల్యాణదుర్గం లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదువుతున్న సుమారు వెయ్యి మంది విద్యార్థులకు మంచి నీరు అందాలనే సత్సంకల్పం తో ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి చేసిన అపర భగీరథ ప్రయత్నానికి నిదర్శనాలే ఈ ఫోటోస్. ఈ మంచి నీటి కలను సాకారం చేసి, మా కళాశాలకు జల కళ ను తీసుకువచ్చింది మాత్రం డాక్టర్ రాయుడు కోక. ఈయన కళాశాల కు రెండు లక్షల రూపాయల విలువ చేసే RO ప్లాంట్ ను బహుకరించారు. దీని సామర్థ్యం 500 లీటర్లు. మా విద్యార్థులు సైతం దానిని కళాశాలలో నెలకొల్పడానికి తమ వంతు సహాయ సహకారాలను అందించారు. మా విద్యార్థులు శ్రమ సౌందర్యం తెలిసిన వారు మరి. ఈ శ్రమదానం చేస్తున్న విద్యార్థులకు తగు ప్రోత్సాహాన్ని కల్పించినది మాత్రం మా NSS Coordinator అయిన డాక్టర్ కాంతా రావే మరి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home