కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళశాల లో 24 సెప్టెంబర్ 2022 NSS DAY సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సదస్సులో డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ గా ఇటీవల గ్రూప్ I పరీక్షలలో ఎంపికైన శ్రీమతి D.Naga Jyothi madam పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు . డిప్యూటీ కలెక్టర్ హోదాను సాధించడానికి ఆమె సాగించిన ప్రస్థానాన్ని సరళమైన శైలిలో విద్యార్థుల హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. నాగ జ్యోతి మేడమ్ గారి స్వస్థలం బుక్కపట్నం అనే గ్రామం. ఇంటర్మీడియట్ లో గణితాన్ని అభ్యసించిన ఈమె డిగ్రీ లో మాత్రం బి. కామ్ కోర్సు చేయడం జరిగింది. తరువాత పీజీ చరిత్ర లో పూర్తిచేసి , మొదట గా ప్రైవేట్ స్కూల్ లో పనిచేశారు. తరువాత ప్రభుత్వ టీచర్ గా సుమారు 12 సంవత్సరాల పాటు పనిచేశారు. ఇప్పుడు గ్రూప్ I లో నెగ్గి డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విజయాలన్నీ ఆమె వివాహం చేసుకున్న తరువాత గృహిణి గా బాధ్యతలు నిర్వహిస్తూ సాధించడం జరిగింది. D.Naga Jyothi madam విద్యార్థులతో మాట్లాడుతూ, " సంకల్పం ధృడంగా ఉంటే, లక్ష్యం నెరవేరి తీరుతుందని" చెప్పారు. గ్రూప్ I మరియు అఖిల భారత సర్వీసెస్ కు ఎలా సన్నద్ధం కావాలో చక్కగా వివరించారు. ఈమె ప్రసంగం తో అధ్యాపకులు కూడా స్పూర్తిని పొందారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ బాల కృష్ణ గారు కూడా పాల్గొని చక్కని సందేశం ఇచ్చారు. చెడు అలవాట్లకు దూరంగా ఉన్న విద్యార్థులు మాత్రమే ఉన్నత పదవులను సాధించ గలరని ఆయన చెప్పారు. ఉద్యోగులుగా కంటే కూడా వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదిగితే వారి భవిష్యత్తు తో పాటు దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆయన తెలియజేశారు. తరువాత ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నాగ జ్యోతి గారి ని, మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ బాల కృష్ణ గారిని అధ్యాపకులు మరియు విద్యార్థులు సన్మానించడం జరిగింది. చివరగా అతిథులిరువురూ కళాశాల విజిటర్స్ రిజిస్టర్ లో తమ అభిప్రాయాలను నమోదు చేయడం జరిగింది. ఇంత అధ్బుతమైన కార్యక్రమానికి రూపకర్త అయిన NSS Coordinator కాంతారావ్ గారిని అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించడం జరిగింది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home