గెలిచినవాడికి కాలం చెయ్యెత్తి జై కొడుతుంది.. ఓడిన వాడికి కాలం జల సమాధి కడుతుంది అన్నారు సినారె. ఇది అక్షరాలా నిజం. గెలుపు ఇచ్చే ఆనందం ఇంకా ఏదీ ఇవ్వదు. గెలిస్తే జై కొడతారు, ఓడితే ఛీ కొడతారు. జై కొట్టించుకోవడమా, ఛీ కొట్టించుకోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది. నిరంతరం శ్రమిస్తే గెలపు నీకు సలాం చేస్తుంది అనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈనాడు 'ఈనాడు' దినపత్రిక వారి నిర్వహణ లో టాలెంట్ టెస్ట్ ను మా విద్యార్థులకు నిర్వహించాము.160 మంది పాల్గొన్న ఈ పోటీ లో జాహ్నవి, వెంకటేశులు మరియు సంతోష్ అనే విద్యార్థులు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో నిలిచారు. వీరికి ఈనాడు పత్రిక వారు మంచి విలువైన బహుమతులను అందజేశారు. మేము విద్యార్థులకు ప్రతి మలుపు లో గెలుపును పరిచయం చేస్తాము. గెలవడం మనకు ఒక అలవాటు కావాలి.
విద్యార్థు లారా! గెలుపును బానిసగా మార్చుకోవాలనుకునే వారికోసం ఈ గీతం
'ఉడుకు పుట్టాలి
ఊపు రావాలి ,
మట్టిలో పుట్టి మణివి కావాలి,
నీదొక ఆగని ప్రయాణం,
అడుగు దాటును యోజనం'
మీ గెలుపుకు మా భరోసా అనేది ఈ కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేస్తున్న వాగ్దానం. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ మొత్తం తతంగం వెనుక ఉన్న సూత్రధారి, పాత్రధారి మనందరి కాంతారావే.
1 Comments:
విద్యార్థులు అదృష్టవంతులు సర్
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home