బతుకు కు ఒక అర్థం , పరమార్థం ఉండాలిరా అబ్బాయ్ అనే వాళ్ళు పెద్దలు. మనం బతుకతూ, వేరేవారికి బతుకును ఇవ్వడం తో పాటు, చనిపోయిన తరువాత కూడా వేరేవారికి బతుకునిస్తే, వెలుగు నిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. చచ్చే బుద్ధి, ఇచ్చే బుద్ధి అందరికీ రావంట కదా! మరి అలాంటిది చచ్చిన తరువాత కూడా ఇచ్చే అవకాశం వస్తే ఎంత మహత్తరం గా ఉంటుందో కదా. మనం మరణం తరువాత కూడా జీవించాలంటే, అవయవ దానం ద్వారా మాత్రమే సాధ్యం. ఒకప్పుడు అన్ని దానాల లోకి శ్రేష్టం అన్నదానం అనేవారు. కానీ ఇప్పుడు మాత్రం అవయవ దానం అన్ని దానాల లోకి శ్రేష్టం. మరి అందుకోసం ప్రారంభించిన జీవన దాన్ ట్రస్ట్ గురించి అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 3, 2023 న మా కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆదిరెడ్డి పరదేశి నాయుడు అనంతపురం వైద్య కళాశాల నుండి రావడం జరిగింది. చక్కగా ప్రసంగించి మా బతుకులకు అర్థం తెలియజేశారు పరదేశీ.
దేహో దేవాలయం ప్రోక్తం, జీవో దేవ సనాతన: అని కదా అనింది మనోళ్ళు. మనోళ్ళు మా పెద్ధ పనోళ్ళు. మరి ఆ దేహం లో శివం పోతే ఇక శవమే కదా మిగిలేది. చావు ఎప్పుడొస్తుందో తెలియని మనకి, చావు తరువాత బతికే అవకాశం వస్తే , ఎంత బాగుంటుందో కదా. మన మరణం తరువాత మన కళ్ళు ఇంకా ఈ ప్రపంచాన్ని మరియు దాని అవధి లేని అందాన్ని చూడగలిగితే ఎలా ఉంటుంది? ఓహ్ .. ఆ ఊహే అధ్బుతం కదా! మరణం తరువాత మన గుండె వేరే వాళ్ళలో లబ్.. డబ్ అని కొట్టుకుంటే ఆ హృదయ మృదంగ ద్వానం వినేవారికి ఎంత బాగుంటుందో కదా. మరి రండి .. చచ్చి బతుకుదాము...... చావును జయిద్దాము.
ఏ అవయవాలు దానం ఇవ్వవచ్చు?
గుండె
కాలేయం
చర్మం
పేగు
కళ్ళు
మూత్ర పిండాలు
క్లోమం
ఒక మృతుడు చేసే అవయవ దానం ద్వారా సుమారు 8 మంది బతక వచ్చు. మన అవయవాలు దాన యోగ్యంగా ఉండాలి అంటే బతికి ఉన్న రోజుల్లో మన దేహాన్ని అవయవాలను బాగా కాపాడుకోవాలి. ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని అనుసరించాలి. పొగ తాగినా, మద్య పానం చేసినా కాలేయం చెడిపోతుంది. చాలా మంది యవ్వనం లో ప్రేమ విఫలమై తాగుడుకు అలవాటు పడతారు. వారికి హెచ్చరిక " Lover పోతే వస్తుంది.. liver పోతే రాదు". బ్రైన్ డెడ్ అయిన వారు మాత్రమే అవయవ దానానికి అర్హులు సుమా.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home