Thursday, February 16, 2023



















































 ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా కమీషనరేట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ఓపెన్ డే ముందస్తు కార్యక్రమం మా కల్యాణదుర్గం అధ్యాపకులు అద్బుతంగా నిర్వహించారు. మా ప్రిన్సిపల్ జయరామ రెడ్డి సూచనల మేరకు మా వైస్ ప్రిన్సిపల్ వెంకట శేషయ్య, అధ్యాపకులను బృందాలుగా విభజించి, వారికి ఒక రూట్ మ్యాప్ ను ఇచ్చారు. ఈ రూట్ మాప్ లో అధ్యాపక బృందం సందర్శించాల్సిన జూనియర్ కాలేజీల వివరాలు ఉంటాయి. మేమందరూ ముందుగానే మా రాక గురించి ఆ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ కు తెలియజేశాము. అక్కడ మేము ఏమి చేయాలో కూడా మా అకడెమిక్ కోర్దీనేటర్  శశి కిరణ్ చక్కగా తెలియజేశారు. అన్ని గ్రూప్ ల విద్యార్థులను విడివిడిగా కలిసి వారికి మా కళాశాల లో ఉన్న సదుపాయాలు మరియు గ్రూప్ ల వివరాలు తెలియజేయాలి. మా అధ్యాపకులు సందర్శించిన కళాశాలలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది 

బ్రహ్మ సముద్రం : కాంతారావ్, సూర్య నాగిరెడ్డి, శశి కిరణ్మ, మస్తాన్ మరియు శశి కుమార్ 

కుందుర్పి : మురళి కృష్ణ, పి. ఎస్ . లక్ష్మీ , వెంకట్రాముడు మరియు కృష్ణ వేణి 

బొమ్మనహాల్ : జి. ఎల్. ఎన్. ప్రసాద్ , బసిరెడ్డి శ్రీదేవి, మరియు రుక్మిణీ భాయి 

శెట్టూర్ : చంద్ర శేఖర్ 

బెలుగుప్ప: చంద్రశేఖర్ , మాసినేని సుధాకర్, పరమేశ్, రాఘవేంద్ర 

కంబదూర్ : శేషయ్య, లక్ష్మీ నారాయణ , గణేష్, చక్రవర్తి 

కల్యాణదుర్గం : విజయ లక్ష్మీ, నిత్యానంద, నాగశేష 

వెళ్ళిన ప్రతిచోటా విద్యార్థులతో, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మా కళాశాల లో చదువుతున్న విద్యార్థులను కూడా రాలీ గా తీసుకువెళ్ళాము. ఈ విద్యార్థులు మా కళాశాల లో ఉన్న సౌకర్యాల గురించి ఇంటర్ విద్యార్థులకు చక్కగా తెలియజేశారు. అధ్యాపకులు కూడా అలాగే ఈ క్రింది సదుపాయాల గురించి చర్చించారు 

- అందుబాటులో ఉన్న కోర్సు వివరాలు 

- కోర్సు చేయడం వలన వున్న లాభాలు 

- తరగతి గదులు, ప్రయోగశాలలు మరియు లైబ్రరి సదుపాయాలు 

- e  క్లాస్ రూమ్స్ మరియు డిజిటల్ తరగతులు 

- JKC 

- Language labs 

- Bridge courses 

- ICT 

వెళ్ళిన అన్ని చోట్ల కూడా ఆయా జూనియర్ కళాశాల ల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు చక్కగా సహకరించడమే కాకుండా ఆతిథ్యం ఇవ్వడం తో పాటు ఆత్మీయ సన్మానం కూడా చేశారు.  ఈ కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావం తో మా అధ్యాపకులు మరియు విద్యార్థులు పూర్తీ  చేయడం తో ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ అభినందిచారు 

"మేధావులారా !!!!!!! విద్యా వ్యవస్థ లో అన్ని స్థాయిల లో గోడలు కూలగొట్టి , వంతెనలు నిర్మిద్దాం. కలిసి సమన్వయం తో పనిచేద్దాం. ప్రభత్వ విద్య ను బలోపేతం చేద్దాం."

                                            - ప్రిన్సిపల్ జయరామ రెడ్డి , ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కల్యాణదుర్గం 

1 Comments:

At February 16, 2023 at 5:53 PM , Blogger Manohar S Naik R said...

Very Nice program sir Super sir

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home