కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన 74 వ గణతంత్ర వేడుకలు కలకాలం విద్యార్థుల మరియు అధ్యాపకుల హృదిలో, మది లో చెరగని ముద్ర వేసాయి. ఈ రోజు మా విద్యార్థుల దేశ భక్తిని చూసి భరతమాత మురిసిపోయింది. అణువణువున దేశ భక్తి ని నింపుకున్న మా విద్యార్థులు అనేక కార్యక్రమాల ద్వారా భారత రాజ్యాంగ స్పూర్తిని చాటారు. మొదటగా అసెంబ్లీని నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ మువ్వన్నెల జండా మా విద్యార్థులను చూసి ఇక తన భవిష్యత్తు కు ఎలాంటి ఢోకా లేదని ఎంతో ఆత్మ విశ్వాసం తో రెప రెప లాడింది. మా ప్రిన్సిపల్ విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఈ సంధర్భంగా అందజేశారు. దేశ ఆర్థిక పరిస్థితి సుస్థిరంగా వుండాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి అని తెలియజేశారు. దానికి అనుగుణం గానే కళాశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తరువాత పరీక్షల లో అత్యుత్తమ మార్కుల ను సాధించిన 18 మంది విద్యార్థులను, వివిధ పోటీ లలో బహుమతులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. చరిత్ర అధ్యాపకులు నిత్యానంద చక్కటి సందేశాన్ని ఇచ్చారు. తరువాత విద్యార్థులకు స్వీట్స్ పంపకం షరా మామూలే.తరువాత వ్యాయామ అధ్యాపకులు నాగశేష ఆధ్వర్యం లో జరిగిన పిరమిడ్ మరియు saree డాన్స్ .. కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలా మా కళాశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా ముగిశాయి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home