1983- 84 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి మిత్ర బృంద సమావేశం స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగినది ఈ సమావేశానికి దాదాపు 30 మంది సభ్యులు పైగా హాజరు కావడం జరిగింది మిత్రుడు హరినాథ్ మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమానికి తమ వంతు సహాయంగా మిత్రులు విరాళంగా ప్రకటించదల్చుకున్నట్లు నిర్ణయం తీసుకున్నారని ఆ కార్యక్రమం త్వరలో అమలు చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కిందటి నాటి మిత్రులు హాజరై అనుభవాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈరోజు సభ్యులు ఆయా స్థాయికి చేరుకోవడం ఆనందదాయకమని అధ్యాపకులుగా స్థిరపడ్డ కాంతారావు తెలియజేశారు. ఇలాంటి మిత్ర బృంద సమావేశాలను భవిష్యత్తులో కూడా జరుపుకుంటామని తమ మిత్రబృందం తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటామని దస్తగిరి రెడ్డి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మధు శంకరయ్య చెన్నారెడ్డి బాలన్న నాగిరెడ్డి నరసింహనాయుడు సుబ్బయ్యల తో పాటు మిత్రులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home