Saturday, May 21, 2022


































కల్యాణదుర్గం పట్టణం లో 1984 లో స్థాపించబడిన కళాశాల SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇంచు మించు 38 వసంతాల పాటు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు రాచబాట వేసిన కళాశాల ఇది. ఇప్పుడు సకల హంగులతో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న చదువుల గుడి ఇది. అక్కమ్మ కొండ దాపున వెలసిన అమ్మ ఒడి ఈ కళాశాల. దీని చూపు పడినంత మేరా విద్యా సుమాలు విరౠయవలసిందే.  చదువుతో పాటు జీవితపు మెళుకువలను విద్యార్థులకు బోధించే సరస్వతీ నిలయం ఇది. ఇరుకు గదులలో కూచోబెట్టి కేవలం మొక్కుబడి విద్యను బోధించే నెలవు కాదు ఇది. అనేక నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించే కాణాచి ఈ SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల. మరి దీని సొబగులు.. సొగసులు ఏంటో  తెలుసుకుందాం. 

- విశాలమైన ప్రాంగణం 

- శారీరిక వికాసానికి క్రీడా మైదానం మరియు వ్యాయామశాల 

- స్టేడియం 

- గ్రంథాలయం 

- పచ్చటి పరిసరాలు 

- రెండు అంతస్థులలో నిర్మించిన తరగతి గదులు 

- చక్కటి ప్రయోగశాలలు 

- e క్లాస్ రూములు 

- డిజిటల్ తరగతి గదులు 

- నిష్ణాతులైన అధ్యాపకులు 

- బాటనీ గార్డెన్ 

- JKC మరియు Language labs 

- B.A., B.Com మరియు B.Sc కోర్సు లలో ప్రవేశాలు 

- B.A లో THP, Rural Development, మరియు EHP కోర్సులు అందుబాటులో ఉన్నాయి 

- B.Com జనరల్ మరియు CA కోర్సు లు ఉన్నాయి 

- B.Sc లో BZC (Botany, Zoology & Chemistry) , Mi.B.C, PMT, MPC మరియు  MPCs కోర్సు ల లో       బోధన సాగుతోంది 

- అనంతపురం జిల్లా లోనే కేవలం మూడు ప్రభుత్వ కళాశాలలలో అందుబాటులో వున్న PMT  

  (Paramedical Technology) కోర్సు ఈ కళాశాలలో కూడా అందుబాటులో ఉండడం విద్యార్థులకు 

   వరం 

- కమ్యూనిటి సర్విస్ ప్రాజెక్టు ప్రతి ఏడాది చేపడతారు 

- Internship & On Job Training అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి.  

- పోటీ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. 

- ఒత్తిడి లేని విద్య ఇక్కడ లభ్యం 

- Life skills & Soft Skills కోసం ప్రత్యేక శిక్షణ 

- ప్రాంగణ నియామకాలు ప్రతి ఏడాది చేపడతారు 

- NSS, RRC & YRC తరపున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. 

- కళాశాలకు వెబ్ మాగజై న్ ఉంది. 

- కళాశాల అధ్యాపకులు చేసిన సుమారు వెయ్యి విద్యా సంబంధ వీడియోలు యూ ట్యూబు లో 

   అందుబాటులో వున్నాయి 

- Online & Offline పద్దతిలో బోధన కొనసాగుతుంది 

- ప్రతి సంవత్సరం field trips & Educational tours కు విద్యార్థులను తీసుకువెళతారు. 

మరి ఇన్ని హంగులున్న మన SVGM GOVERNMENT DEGREE COLLEGE , KALYANDURG లో విద్యార్థులను చేర్చండి.. చేర్పించండి 


 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home